: ఉగ్రవాదాన్ని ఎదుర్కోగల శక్తి యువతకే ఉంది : బొత్స


ఉగ్రవాదాన్ని సమర్ధంగా ఎదుర్కో గల శక్తి యువతకే ఉందని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ విశ్వాసం వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా హైదరాబాదు గాంధీభవన్ లో ఈ ఉదయం చేపట్టిన దీక్షను బొత్స ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేలుళ్లు జరిగిన తక్షణమే యువజన కాంగ్రెస్ స్పందించిందని చెప్పారు.

తనవంతు సాయంగా రక్తదాన శిబిరం ఏర్పాటు కృషి చేసిందని ప్రశంసించారు. మళ్లీ ఇప్పుడు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దీక్ష చేపట్టి పలువురికి ఆదర్శంగా నిలుస్తోందని అభినందించారు. 
ప్రజలను చైతన్యవంత పరిచే మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో చేపట్టాలని యువజన కాంగ్రెస్ నాయకులకు బొత్స పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News