: కోర్ కమిటీకి ఆంటోనీ కమిటీ నివేదిక నేడే
ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు ప్రధాని మన్మోహన్ నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఆంటోనీ కమిటీ మన రాష్ట్ర విభజనకు సంబంధించిన నివేదికను సమర్పించనుంది. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం తలెత్తిన ఆందోళనలు, సమస్యలపై ఈ సందర్భంగా కోర్ కమిటీ చర్చించనుంది. ఆంటోనీ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే కాంగ్రెస్ తెలంగాణ విషయంలో ముందడుగు వేయనుంది. అలాగే తెలంగాణకు సంబంధించిన కేబినెట్ నోట్ పై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే కేబినెట్ నోట్ తయారయిందని కేంద్ర హోం శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.