: ఈ కరెంటు బిల్లు చూస్తే హై వోల్టేజ్ షాక్ ఖాయం..!


కరెంటు బిల్లుల మోత ఈ మధ్య మనకు బాగానే వినిపిస్తోంది! కానీ, జైపూర్లో ఓ పెద్దాయనకు ఈ విద్యుత్ ఛార్జీ దిమ్మతిరిగేలా చేసింది. ఓ సాధారణ వర్క్ షాప్ నిర్వహించే పోఖర్మల్ సేన్ కు గతనెలకు సంబంధించి ఏకంగా రూ.54.94 కోట్ల కరెంటు బిల్లు వచ్చిందంట. విద్యుత్ శాఖ సిబ్బంది ఈ బిల్లును ఇవ్వగానే అది చూసి సేన్ గారు నోటమాట పడిపోయినవాడిమల్లే అయిపోయాడు. కాసేపటికి నోరు పెగల్చుకుని, 'ఇది ఎలా సాధ్యం?' అంటూ వారిని ప్రశ్నించాడు. 'కార్యాలయంలో కనుక్కోండి' అని రొటీన్ డైలాగ్ చెప్పి వారు వెళ్లిపోయారు. సేన్ జైపూర్ డిస్కమ్ అధికారులను సంప్రదించడంతో, అది టైపింగ్ పొరబాటో, కంప్యూటర్ తప్పిదమో అయివుంటుందని, తాము పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కాగా, సాధారణంగా ప్రతి నెలా సేన్ కు 12 వేల నుంచి 18 వేల మధ్యలో కరెంటు బిల్లు వస్తుందట.

  • Loading...

More Telugu News