: చిచ్చు పెట్టి కాంగ్రెస్ వేడుక చూస్తోంది: టీడీపీ నేత గోరంట్ల


కాంగ్రెస్ తన స్వార్థం కోసం రాష్ట్ర సమస్యను జటిలం చేస్తోందని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విరుచుకుపడ్డారు. ఈ రోజు ఉదయం ఒక టీవీ చానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ గోరంట్ల ఈ వ్యాఖ్యలు చేశారు. విభజన విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా... ఇరు ప్రాంత ప్రజల మధ్య చిచ్చు పెట్టి వేడుక చూస్తోందని అన్నారు. ఆంధ్రా రాజధాని కోసం నాలుగు లక్షల కోట్లు అవసరం అవుతాయని తమ అధ్యక్షుడు అంటే... ఎగతాళిగా మాట్లాడారని విమర్శించారు. అన్ని సమస్యలను పరిష్కరించిన తర్వాతే... రాష్ట్ర విభజనపై కేంద్రం ముందడుగు వేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News