: దురాక్రమణలపై హిమాచల్ హైకోర్టు ఆగ్రహం
సిమ్లాలోని వివిధ మార్కెట్లలో దురాక్రమణలపై హిమాచల్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆరు వారాల్లోగా దురాక్రమణలను గుర్తించి అఫిడవిట్ సమర్పించాలని మునిసిపల్ కమిషనర్ ను ఆదేశించింది. సిమ్లాలోని లోయర్ బజార్, గంజ్ బజార్ లతో పాటు ఇతర మార్కెట్లలో స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని నీలం శర్మ అనే మహిళ పిల్ వేసింది. దీన్ని విచారించిన ద్విసభ్య బెంచ్ ఈ ఉత్తర్వులిచ్చింది. ఆక్రమణకు గురైన ప్రతి స్థలాన్ని కమిషనర్ దగ్గరుండి పరిశీలించాలని ఆదేశించింది. కబ్జారాయుళ్లందరి దగ్గర నుంచి వివరణ తీసుకోవాలని తెలిపింది.