: విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి : విద్యాసాగర్ రావు


సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ సీనియర్ నాయకుడు సి.హెచ్.విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు. ఈ రోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయనీ విధంగా వ్యాఖ్యానించారు. నిజాం వ్యతిరేక పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు కలసికట్టుగా పాల్గొన్నాయని... అదే విధంగా సెప్టెంబర్ 17న కూడా అన్ని పార్టీలు కలసి పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఎగరవేయాలని కోరారు. జిల్లాలలో ఆగస్టు 15న మంత్రులు, కలెక్టర్లు జెండా ఎగరవేసే ప్రతి చోటా... విమోచన దినోత్సవంనాడు జాతీయ జెండాలు ఎగరవేయాలని సూచించారు.

దీనికి తోడు జలయజ్ఞం నిధుల దుర్వినియోగంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా జలయజ్ఞం అవినీతిలో భాగస్వాములైన ఎంపీలు, ఇతర నాయకులపై చర్యలకోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. ఈ విషయమై సుష్మాస్వరాజ్ తో మాట్లాడతామని అన్నారు.

  • Loading...

More Telugu News