: ఇది హైదరాబాదా లేక పాకిస్థానా?: మల్లాది విష్ణు
సమైక్యాంధ్రకు మద్దతుగా హైదరాబాదులో ఏపీఎన్జీవోలు నిర్వహించిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ విజయవంతం కావడంతో... టీఆర్ఎస్ పార్టీ కలవరపడుతోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. ఈ రోజు హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్రులపై తెలంగాణవాదులు చేస్తున్న దాడులను చూస్తే... మనం హైదరాబాదులో ఉన్నామా? లేక పాకిస్థాన్ లో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో శాంతియుతంగా జరిగే సభలను అడ్డుకోవాలనుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.