: కోల్ కతా ప్రమాదంలో 13కి చేరిన మృతులు
కోల్ కతా నగరంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 13కి చేరుకుంది. అగ్నిమాపక శకటాలు ఇంకా అలుపెరగకుండా శ్రమిస్తూనే ఉన్నాయి. కలకత్తా యూనివర్సీటీ సమీపంలోని సూర్యాసేన్ మార్కెట్లో ఈ తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
అగ్నిమాపక సర్వీసుల మంత్రి జావేద్ ఖాన్ స్వయంగా దగ్గరుండి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. మంటల్లో మరింత మంది చిక్కుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే నలుగురిని సహాయక దళాలు రక్షించాయి.