: శ్రీవారి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వివరాలను తెలిపే వాల్ పోస్టర్ ను ఈ రోజు జరిగిన ఓ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు ఆవిష్కరించారు. కాగా, శ్రీవేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 5 నుంచి 13 వరకు జరగనున్నాయి. 13న జరిగే చక్రస్నానంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.