: సీమాంధ్ర ఉద్యమానికి సీఎం కన్వీనర్: పొన్నం


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ మరోసారి ఘాటైన విమర్శలు చేశారు. సీమాంధ్ర ఉద్యమానికి ముఖ్యమంత్రి కన్వీనర్ గా, డీజీపీ దినేశ్ రెడ్డి కో-కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సుప్రీం కోర్టులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దినేష్ రెడ్డి డీజీపీగా కొనసాగడానికి అనర్హుడని అన్నారు. రాష్ట్ర విభజనపై ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందని... ఎన్ని ఉద్యమాలు, ఆందోళనలు చేసినా ప్రయోజనం లేదని తెలిపారు. సీమాంధ్రుల ఉద్యమాలపై సీఎం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News