: అందరితో చర్చించాకే ప్రధాని అభ్యర్ధిని ప్రకటిస్తాం: బీజేపీ
రానున్న సార్వత్రిక ఎన్నికలకు ప్రధాని అభ్యర్ధిని ప్రకటించేందుకు భారతీయ జనతా పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే ఈ అంశంపై పలుమార్లు చర్చించిన బీజేపీ ఇంకా అందరితో మాట్లాడాలంటోంది. దీనిపై ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఓ వార్తా ఛానల్ తో మాట్లాడుతూ.. పార్టీలో ప్రతి ఒక్కరితో చర్చించాకే ప్రధాని అభ్యర్ధిని ప్రకటిస్తామన్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని త్వరలో అభ్యర్ధిని ప్రకటిస్తామని, ఎవరిని ఎన్నుకోవాలన్న దానిపై పార్టీలో ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని బీజేపీ అధికార ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. మరోవైపు, ఈ విషయంపైనే చర్చించేందుకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నేడు నరేంద్ర మోడీని కలవనున్నారు.