: సీఎల్ టి20 టోర్నీలో పాకిస్తాన్ ప్రాతినిధ్యం ఉండదు..


టెస్టు దేశాల దేశవాళీ టి20 చాంపియన్ల మధ్య నిర్వహించే చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ ఈ నెల 17 నుంచి భారత్ వేదికగా జరగనుంది. ఈ పోటీల్లో మనదేశం నుంచి తొలి మూడు స్థానాల్లో నిలిచిన ఐపీఎల్ జట్లు పాల్గొంటుండగా.. పొరుగుదేశం పాకిస్థాన్ నుంచి దేశవాళీ టి20 విజేత ఫైసలాబాద్ వోల్వ్స్ ఆడాల్సి ఉంది. అయితే, దాయాది జట్టుకు భారత అధికారులు వీసా నిరాకరించారు. గతకొద్ది రోజులుగా భారత్-పాక్ మధ్య రాజకీయ వాతావరణం వేడెక్కడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News