: ఐగేట్ సీఈవోగా వేమూరి


సాఫ్ట్ వేర్ సేవలందించే ఐగేట్ సంస్థకు సీఈవోగా వేమూరి అశోక్ ను నియమిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. కాలిఫోర్నియాలోని ప్రధాన కార్యాలయం నుంచి తమకు సమాచారం అందినట్టు బెంగళూరులో ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సీఈవోగా, సంస్థ ప్రెసిడెంట్ గా ఆయన ఐగేట్ లో కొనసాగుతారని వారు స్పష్టం చేశారు. ఈ నెల 16న ఐగేట్ సీఈవోగా అశోక్ పదవీబాధ్యతలు స్వీకరించనున్నారు. అశోక్ కొద్దిరోజుల క్రితం ఇన్ఫోసిస్ అమెరికా విభాగం అధిపతిగా పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఐగేట్ సంస్థకు సీఓవోగా సేవలందించిన ఫణీశ్ మూర్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో సంస్థ ఆయనని తొలగించింది. ఇప్పుడాయన స్థానంలో అశోక్ ను నియమించారు.

  • Loading...

More Telugu News