: సమైక్యానికి మద్దతుగా ఎన్టీపీసీ ఉద్యోగుల సమ్మె
సమైక్య ఉద్యమ కార్యాచరణలో భాగంగా విద్యుత్ ఉద్యోగులు కదం తొక్కుతున్నారు. విజయవాడలోని ఎన్టీపీసీ లో ఉద్యోగులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. వీరికి కార్మికులు కూడా జత కలిశారు. దీంతో ఈ విద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్ కు ఈ మధ్యాహ్నం నుంచి అంతరాయం కలిగే అవకాశాలున్నాయి.