: కోల్ కతా మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం...ఆరుగురు మృతి
కోల్ కతాలోని సూర్య సేన్ మార్కెట్లో ఇవాళ తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంకా పదుల సంఖ్యలో మంటల్లో చిక్కుకుని ఉంటారని తెలుస్తోంది.
ప్లాస్టిక్, పేపర్ వ్యాపారం ఎక్కువగా చేసే ఈ మార్కెట్లో మంటలు చెలరేగడంతో అగ్ని కీలల్ని అదుపు చేయడానికి 20 ఫైరింజన్లతో అగ్ని మాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా.