: యంత్రపు కళ్లు!
చైనాలోని ఒక ఆరేళ్ల కుర్రాడిని ఎవరో దుండగులు గతనెల 24న ఎత్తుకెళ్లి అతని కళ్లను పీకేసి, కంటిగుడ్లను, అతడిని ఒక తోటలో పడేసి వెళ్లిపోయారు. ఈ సంఘటన వినడానికి చాలా భయానకంగా ఉందికదూ... ఇది నిజంగానే జరిగింది. కంటిచూపు కోల్పోయిన ఈ ఆరేళ్ల కుర్రాడికి హాంకాంగ్‌కు చెందిన వైద్యుడు ఒకరు కృత్రిమ కళ్ళను అమర్చేందుకు ముందుకొచ్చాడు.
ఈ కుర్రాడికి కళ్ళ స్థానంలో కృత్రిమ ఉపకరణాలను ఏర్పాటు చేయడానికి మంగళవారం నాడు శస్త్రచికిత్స మొదలయ్యింది. షెంజెన్‌లోని డెనిస్‌ల్యామ్ కంటి ఆసుపత్రిలో ముందుగా చిన్న చికిత్స మొదలుపెట్టారు. ఈ చికిత్స తర్వాత అతనికి కంటిలో సహజ కళ్ళలాగే అటూ ఇటూ కదిలే కృత్రిమ కళ్లను ఏర్పాటు చేసే మరో పెద్ద చికిత్స చేస్తారు. ఈ ఎలక్ట్రానిక్ కళ్లు ఆ కుర్రాడికి పూర్తి స్థాయిలో చూపును ఇవ్వలేకపోయినా మెదడుకు అందే వెలుగు నీడల సంకేతాల ద్వారా తన ఎదుటి ఆకారాలను పసిగట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుడా ఈ కుర్రాడు ఒంటరిగా వెళ్లగలిగేలా అతడికి కొన్ని ప్రాంతాలపై నావిగేషన్ సెన్సారులు అమర్చుతామని వైద్యులు తెలిపారు.