: కేసీఆర్, జగన్ లే రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారు: సోమిరెడ్డి


కేసీఆర్ నోటి దురుసువల్ల, జగన్ చేతివాటం వల్ల రాష్ట్రం అధోగతి పాలైందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, పారిశ్రామిక వేత్తలను 420లుగా తయారు చేసి వారి పరువు తీసిన ఘనత జగన్ దని మండిపడ్డారు. పార్టీలు లేఖలు ఇస్తే రాష్ట్రాలను విభజించాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా రాష్ట్ర విభజన అంశంపై ప్రజాభీష్టం మేరకు నడుచుకోవాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News