: గుండ్లకమ్మ వాగులో ఇద్దరు విద్యార్థుల గల్లంతు
ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ వాగులో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ సంఘటన నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు వద్ద జరిగింది. గల్లంతయిన విద్యార్థులను నాగరాజు, మహేంద్రగా గుర్తించారు. వారిద్దరూ ఇంజినీరింగ్ చదువుతున్నారు.