: దిగ్విజయ్ సింగ్ కు సీమాంధ్ర ఎంపీల లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ కు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు లేఖ రాశారు. హైదరాబాద్ లో ఏపీఎన్జీవోల సభ నేపథ్యంలో జరిగిన దాడులు, నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను ఈ లేఖలో వివరించారు. నగరంలో సీమాంధ్రులకు రక్షణ కరవైందని తెలిపారు. చేజారిపోతున్న పరిస్థితులకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులే కారణమని ఆరోపించారు. కాబట్టి అధిష్ఠానం వెంటనే చర్యలు తీసుకోవాలని సీమాంధ్ర ఎంపీలు కోరారు.