: రామ్ గోపాల్ వర్మ సినిమాపై హైకోర్టులో పిటిషన్
రామ్ గోపాల్ వర్మ తాజాగా రూపొందించిన '26/11 ఇండియాపై దాడి' సినిమాపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు అనుమతివ్వడాన్ని సవాలు చేస్తూ హైదరాబాదుకు చెందిన న్యాయవాది తీగల రామ్ ప్రసాద్ ఈ పిటిషన్ వేశారు.
ఈ సినిమా విడుదలైతే ముంబై దాడుల్లో మృతి చెందిన వారి కుటుంబాలు దారుణమైన మానసిక వేదనకు గురయ్యే అవకాశం వుందని పిటిషనర్ ఆరోపించారు. పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.