: లష్కరే తీవ్రవాది టుండాకు ఏడు రోజుల కస్టడీ


భారత్-నేపాల్ సరిహద్దుల్లో పట్టుబడిన లష్కరే తోయిబా ఉగ్రవాది, బాంబు తయారీ నిపుణుడు అబ్దుల్ కరీం టుండాకు ఢిల్లీ కోర్టు ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఈ మధ్యాహ్నం టుండాను కోర్టు ఎదుట హాజరుపరిచారు. 1997లో భారత్ లో చోటు చేసుకున్న పలు బాంబు పేలుడు ఘటనల్లో టుండా హస్తముందని నిఘా వర్గాలు అంటున్నాయి. ఈ మేరకు ఢిల్లీ స్పెషల్ సెల్ టుండాను విచారిస్తోంది. టుండా తెలిపిన సమాచారం మేరకే ఇండియన్ ముజాహిదిన్ తీవ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, మరో ఉగ్రవాది అసదుల్లా అక్తర్ లను బీహార్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News