: పూర్తిస్థాయి సమ్మెలోకి సీమాంధ్ర ట్రాన్స్ కో, జెన్ కో ఉద్యోగులు


సీమాంధ్రలో ఉద్యోగుల సమ్మె రోజు రోజుకూ మహోగ్ర రూపం దాలుస్తోంది. ఈ అర్ధరాత్రి నుంచి సీమాంధ్ర ట్రాన్స్ కో, జెన్ కో ఉద్యోగులు పూర్తిస్థాయి సమ్మెలోకి దిగుతున్నారు. ఈ మేరకు వారు సమ్మె నోటీసు ఇచ్చారు. ఆ వెంటనే తమ అధికారిక సిమ్ లను ప్రభుత్వానికి అందజేశారు. ఉద్యోగులు సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందిపడతారని, పునరాలోచించుకోవాలని జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీలు కోరారు. మరోవైపు ఉద్యోగుల సమ్మెపై సమీక్షించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అత్యవసర సేవలకు అంతరాయం కలిగించొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే విద్యార్ధుల భవిష్యత్ దృష్ట్యా స్కూళ్లు, కళాశాలలు తెరవాలని కోరారు.

  • Loading...

More Telugu News