: బీజేపీకి షిండే సవాల్


రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీజేపీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. నరేంద్ర మోడీని ఇప్పటికే ప్రచార సారథిగా నియమించి దూకుడుకు తెరదీసిన బీజేపీ.. ప్రధాని అభ్యర్థిత్వంపై మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. సరిగ్గా ఇదే అంశంలో కాంగ్రెస్.. కమలనాథులపై ఎక్కుపెట్టింది. తాజాగా, కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే బీజేపీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి 'రాము, శ్యాము, దాము.. ఇలా ఏ పేరైనా ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకోవచ్చు' అని సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం రాహుల్ ను ఇప్పటికే తమ నాయకుడిగా ప్రకటించిందని ఢిల్లీలో మీడియాతో అన్నారు.

  • Loading...

More Telugu News