: ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా గుర్తించాలి: ఎంప్లాయీస్ యూనియన్


సీమాంధ్రలో చేస్తున్న సమ్మెను విరమించడానికి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ పెద్ద తిరకాసు పెట్టింది. సమ్మె విరమించాలంటే ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా గుర్తించాలని డిమాండు చేసింది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఎంప్లాయీస్ యూనియన్ నేతలు హైదరాబాద్ బస్ భవన్ లో చర్చలు జరిపారు. మంత్రికి తమ డిమాండును తెలిపామని ఈయూ ప్రధాన కార్యదర్శి పద్మాకర్ తెలిపారు. ప్రయాణీకుల ఇబ్బందులు, సంస్థ ఆర్ధిక నష్టాల దృష్ట్యా సమ్మె విరమించాలని ఈయూ నేతలకు బొత్స విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News