: సమ్మె విరమించండి: బొత్స
ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని పీసీసీ చీఫ్, మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్యోగులను కోరారు. హైదరాబాద్ బస్ భవన్ లో సీమాంధ్ర ఎంప్లాయీస్ యూనియన్ నేతలతో మంత్రి బొత్స సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి పరిగణనలోకి తీసుకుని, సీమాంధ్రలో ప్రజల రాకపోకలకు జరుగుతున్న తీవ్ర ఇబ్బందుల దృష్ట్యా సమ్మెను విరమించాలని కోరారు. దానికి ఆర్టీసీ నేతలు ఈ నెల 16న ఏపీఎన్జీవోల సమావేశం జరగనుందని, అందులో మిగిలిన ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుని వెల్లడిస్తామని తెలిపారు. అలాగే తక్షణం ఆర్టీసీని ప్రభుత్వ డిపార్ట్ మెంట్ గా గుర్తించాలని, అలాంటి నిర్ణయాన్ని తీసుకుంటే తాము సమ్మె విరమించేందుకు సిద్ధమని వారు తెలిపారు.