: నటి జయసుధ భర్త కారులో మంటలు.. తప్పిన ప్రమాదం
సికింద్రాబాద్ ఎమ్మెల్యే, నటి జయసుధ భర్త నితిన్ కపూర్ కారులో గత అర్ధరాత్రి (మంగళవారం)అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన ఆయన వెంటనే కారులో తనతో పాటు ఉన్న సహాయకుడితో కలిసి దిగిపోయారు. దాంతో, తృటిలో ప్రమాదం తప్పింది. అటు, కారు అక్కడికక్కడే దగ్ధమైంది. ఈ ఘటన హైదరాబాద్ గచ్చిబౌలి ఫ్లైఓవర్ పై చోటు చేసుకుంది.