: తెలంగాణ టీడీపీ నేతల భేటీ
పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో తెలంగాణ ప్రాంత తెలుగుదేశం నాయకులు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వ వైఖరి తదితర అంశాలపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం. పార్టీ అధినేత చంద్రబాబుతో రేపు సమావేశం అవుతున్న నేపథ్యంలో... వీరు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. చర్చల సారాంశాన్ని అధినేత ముందు ఉంచి తదుపరి కార్యాచరణకు సిద్ధం కావాలని వీరు నిర్ణయించారు.