: ఏసీబీకి బుక్కయిన పోలీస్ అధికారి
కంచే చేనుమేస్తే.. ఆ చేనుకు రక్షణ ఎలా దొరుకుతుంది? అలాంటి ఘటనే నల్గొండలో చోటుచేసుకుంది. మద్యం వ్యవస్థలో అవినీతిని అంతం చేసేందుకు నల్గొండ ఎక్సైజ్ సీఐగా ప్రభాకర్ ను నియమిస్తే అవినీతికి అర్థంలా మారిన అతడు లంచాలు మరిగి డబ్బుకు కక్కుర్తిపడుతున్నాడు. దీంతో పలువురి ఫిర్యాదుతో స్పందించిన ఏసీబీ అధికారులు పకడ్బందీగా వలపన్ని 30 వేలు లంచం తీసుకుంటుండగా ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.