: వారికి ఉరి కంటే జీవితఖైదే మంచిది.. అత్యాచార వాదనలు
సామూహిక అత్యాచార ఘటనపై ఢిల్లీలోని సాకేత్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. నలుగురు దోషులకు మరణశిక్ష నుంచి మినహాయింపునిచ్చి, జీవిత ఖైదు విధించాలని నిందితుల తరపు న్యాయవాదులు కోరుతున్నారు. అయితే వారికి విధించే శిక్షపై పలు సంఘాలు స్పందిస్తూ ఆ రాక్షసులకు ఉరి వద్దని 14 ఏళ్ల జీవితఖైదు కాకుండా, జీవించి ఉన్నంతవరకు (మరణించేవరకు) ఏ మినహాయింపులు లేని ఖైదీ జీవితాన్ని శిక్షగా విధించాలని కోరుతున్నాయి.