: సీబీఐ చీఫ్ కు ప్రభుత్వ కార్యదర్శి హోదా ఇవ్వండంటున్న సుప్రీం
సీబీఐ డైరెక్టర్ కు ప్రత్యేక హోదాపై సుప్రీంకోర్టు సానుకూలత వ్యక్తం చేసింది. బొగ్గు స్కాంపై వాదనల సందర్భంగా.. సీబీఐ డెరెక్టర్ కు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి హోదా ఇవ్వాలని జస్టిస్ ఆర్ ఎమ్ లోధా ఆధ్వర్యంలోని బెంచ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అందుకు అతను అర్హుడని అభిప్రాయపడింది. దీనివల్ల మధ్యవర్తులతో సంబంధం లేకుండా పలు విషయాలను ప్రత్యక్షంగా సదరు మంత్రికి పంపే అవకాశం, చర్చించేందుకు అర్హత వుంటాయని విశ్లేషించింది. దానివల్ల ఓ అంశంపై దర్యాప్తు జరుపుతున్నప్పుడు వచ్చే సందేహాలు, అనుమానాలకు తావుండే పరిస్థితి రాదని పేర్కొంది. కానీ, కేంద్రం దీనిని తిరస్కరించింది.