: ముజఫర్ నగర్ లో 48కి చేరిన మృతులు


మతసామరస్యం విచ్ఛిన్నమైతే కలిగే నష్టం ఏ స్థాయిలో ఉంటుందో ముజఫర్ నగర్ ఉదంతం తెలియజేస్తోంది. రెండు మతాల ప్రజల మధ్య చెలరేగిన ఘర్షణలతో వారం రోజులుగా ముజఫర్ నగర్ తోపాటు పొరుగు జిల్లాలు కూడా అట్టుడికిపోతున్నాయి. ఆర్మీ రంగప్రవేశంతో పరిస్థితి కుదుటపడినట్లుగా అనిపిస్తున్నప్పటికీ మృతుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. అల్లర్ల కారణంగా మరణించిన వారి సంఖ్య 48కి చేరుకుంది. ముజఫర్ నగర్ లో 42 మంది మరణించగా, పొరుగు జిల్లాలలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, గుర్తించని శవాలు ఇంకా ఉన్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కర్ఫ్యూని సడలిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తన చేతగానితనాన్ని నిరూపించుకున్నారని, ఆయన అధికారం నుంచి తప్పుకోవాలని కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద అన్నారు. అయితే, తన తనయుడు అఖిలేశ్ యాదవ్ ను ములాయం సింగ్ సమర్థించుకున్నారు. మతతత్వ శక్తులు అశాంతిని రాజేయాలని చూస్తున్నాయని ఆరోపించారు.

  • Loading...

More Telugu News