: మోడీకి వ్యతిరేకంగా లండన్ లో నిరసన
'ది ఫ్యూచర్ ఆఫ్ మోడ్రన్ ఇండియా'అనే అంశంపై బ్రిటన్ 'హౌస్ ఆఫ్ కామన్స్' లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగించేందుకు మోడీని ఆహ్వానించడంపై లండన్ లో తీవ్ర నిరసనలు చెలరేగుతున్నాయి. తాజాగా ఈ రోజు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా దక్షిణాసియా మానవ హక్కుల ఉద్యమ కార్యకర్తలు లండన్ లో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. యూకేలో పర్యటించేందుకు మోడీని ఆహ్వానించడం పట్ల నిరసనగా వారీ ఆందోళన చేశారు. లండన్ లోని లేబర్ పార్టీ ఎంపీ బ్యారీ గార్డెనర్ కార్యాలయం ముందు ది సౌత్ ఆసియా సాలిడారిటీ గ్రూప్ తో పాటు మరో పది సంస్థలు ఈ నిరసనలో పాల్గొన్నాయి. అయితే మోడీ ఇప్పట్లో బ్రిటన్లో పర్యటించే అవకాశం లేదని గార్డెనర్ వారికి వివరణ ఇచ్చారు.