: హైదరాబాదును యూటీ చేస్తే యుద్ధమే: మంద కృష్ణ
హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే జరిగేది యుద్ధమేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో ఎంఎస్ఎఫ్ నిర్వహించిన తెలంగాణ భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాదును తెలంగాణకు కాకుండా చేస్తే కాంగ్రెస్ ను తెలంగాణలో లేకుండా చేస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టేందుకు ఈ నెల 21న తెలంగాణ యుద్ధభేరి బహిరంగ సభను ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.