: డబ్బు, పదవి కోసం దిగజారే పార్టీ వైఎస్సార్సీపీ: యనమల
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు విరుచుకుపడ్డారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ.. పదవి, డబ్బు కోసం ఆ పార్టీ ఎంతకైనా దిగజారుతుందని విమర్శించారు. సోనియా డైరెక్షన్ మేరకే వైఎస్సార్సీపీ యాక్షన్ చేస్తోందని అన్నారు. అక్రమార్జన ఆ పార్టీ సిద్ధాంతమైతే, అసత్య ప్రచారం పార్టీ విధానమని ఆయన దుయ్యబట్టారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ ల మధ్య రాయబారాలు నడుస్తున్నాయని... విజయమ్మ, భారతి, షర్మిల, వై.వి.సుబ్బారెడ్డిల ఫోన్లు ట్యాప్ చేస్తే ఈ విషయం తెలుస్తుందని యనమల తెలిపారు.