: ప్రధాని అభ్యర్థి మోడీయేనంటున్న సంఘ పరివార్
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ఖరారు చేయాలని బీజేపీని ఆర్ఎస్ఎస్ కోరింది. మార్పు కోరుకుంటున్న ప్రజల మద్దతు ఆయనకు ఉందని ఆర్ఎస్ఎస్ తెలిపింది. అయితే, ఈ ప్రకటనను బీజేపీనే తగిన సమయంలో చేస్తుందని ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా సంఘ్ పరివార్ నిర్వహించిన కార్యక్రమాల సందర్భంగా ప్రజలు మార్పుకోరుకుంటున్న సంగతి తాము గమనించామని ఆర్ఎస్ఎస్ నేత రామ్ మాధవ్ ఢిల్లీలో తెలిపారు. ఆర్ఎస్ఎస్, బీజేపీల రెండు రోజుల సమావేశాల్లో ఈ విషయాన్ని చర్చించామని, తమ నిర్ణయాన్ని బీజేపీ నాయకత్వం ముందు పెట్టామని, అయితే దాన్ని బహిర్గత పర్చాల్సింది మాత్రం బీజేపీయేనని ఆర్ఎస్ఎస్ నేతలు అభిప్రాయపడ్డారు.