: జగన్ కేసుల అభియోగపత్రాల్లో ప్రస్తావనకు రాని మంత్రుల పేర్లు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో దాఖలు చేసిన మూడు అభియోగపత్రాల్లో సీబీఐ మంత్రుల పేర్లు ప్రస్తావించలేదు. ఆరు అంశాల్లో పెన్నా, భారతి, ఇందూ, లేపాక్షి, సండూర్ పవర్ కు సంబంధించిన వ్యక్తుల పేర్లను ప్రస్తావించిన సీబీఐ.. జగన్, విజయసాయిలను ప్రధాన నిందితులుగా పేర్కొంది. కాగా, ఈ కేసుకు సంబంధించి తీవ్ర ఆరోపణలు రావడంతో ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి మంత్రి పదవులకు రాజీనామా చేశారు. పలుమార్లు లేపాక్షి నాలెడ్జ్ భూ కేటాయింపుల వ్యవహారంలో సీబీఐ అధికారులు వీరిద్దరినీ ప్రశ్నించారు. ఇదే అంశంలో మంత్రి గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలను కూడా విచారించారు. దాంతో, వీరిలో ఎవరినైనా జగన్ కేసుల ఛార్జిషీట్లో పేర్కొనవచ్చని అనుకున్నారు. కానీ, వీరెవరి పేర్లను సీబీఐ పొందుపరచకపోవడం గమనార్హం.