: తమిళనాట పర్యాటకానికి 5 కోట్ల నిధులు విడుదల
తమిళనాడులో పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత 5 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఈ నిధులను తిరుచ్చిరాపల్లి, తిరువర్రూర్ జిల్లాలకు కేటాయించినట్టు అధికారులు తెలిపారు. తిరుచ్చిరాపల్లిలోని పంచమలై ప్రాంతంలోని వన్యప్రాణుల సంరక్షణకు, జలపాతాల అభివృద్ధికి 2.30 కోట్లు, తిరువర్రూర్ లోని ముత్తు పెట్టాయ్ ప్రాంతానికి మిగిలిన మొత్తాన్ని కేటాయించినట్టు వారు తెలిపారు.