: రెండు ప్రాంతాల ప్రజలను ఒప్పించినప్పుడే..: బాబు
రెండు ప్రాంతాల ప్రజలను సంతృప్తి పరచిన తరువాతే విభజన జరగాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాలో తెలుగువారి ఆత్మగౌరవ యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలన చేతకాకపోతే తప్పుకోవాలని సూచించారు. మరో ఆరునెలలు ఆగితే జాతకాలు బయటపడిపోతాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయం వల్ల అనిశ్చితి నెలకొందని కుట్రలు, కుతంత్రాలు ఆ పార్టీకి అలవాటేనని ఆయన మండిపడ్డారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే ఒప్పుకునే ప్రసక్తి లేదని ఆయన పునరుద్ఘాటించారు. రెండు ప్రాంతాల ప్రజలతో చర్చలు జరిపి సానుకూల నిర్ణయం తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని, లేకుంటే తాము సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.