: ఐఫోన్ 5ఎస్ నేడే విడుదల


ఐఫోన్ తో ప్రపంచ మొబైల్ రంగ చరిత్రనే మార్చిన యాపిల్ సంస్థ మరో స్మార్ట్ ఫోన్ మోడల్ తో ప్రత్యర్థులకు సవాల్ విసరనుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న ఐఫోన్ 5ఎస్ ను నేడు విడుదల చేయనుంది. సిలికాన్ వ్యాలీలోని తన ప్రధాన కార్యాలయంలో 5 ఎస్ ను లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ చూడ్డానికి ఇంతకు ముందు మోడల్ లాగే ఉన్నా... హై కెపాసిటీ ప్రాసెసర్, సరికొత్త గ్రాఫిక్స్ సామర్థ్యం దీని సొంతమని యాపిల్ తెలిపింది. ఐఫోన్ 5ఎస్ కు వేలిముద్రలను గుర్తించే సామర్థ్యం కూడా ఉంది. దీనివల్ల ఈ ఫోన్ పోయినా... వేరే వారు దీన్ని ఉపయోగించలేరు. దీని ధర కూడా కొంచెం తక్కువగా ఉంటుందని యాపిల్ తెలిపింది. 5ఎస్... బంగారం రంగులో మెరిసిపోతుందని సమాచారం. చైనాతో పాటు, యూరప్, లాటిన్ అమెరికా దేశాల్లో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భారత వినియోగదారుల నుంచి కూడా ఈ ఫోన్ కు మంచి స్పందన లభిస్తుందని యాపిల్ సంస్థ భావిస్తోంది.

యాపిల్ సంస్థ అమ్మకాల్లో ఐఫోన్ కీలకపాత్ర పోషిస్తోంది. గత ఏడాది ఐఫోన్ల అమ్మకాలు 88 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయంటే విషయం అర్థమవుతుంది.

  • Loading...

More Telugu News