: ఏపీఎన్జీవోల భవిష్య కార్యాచరణ
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు ఏపీఎన్జీవోలు ప్రణాళికలు రచించారు. అందుకు తగ్గట్టుగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. గ్రామగ్రామాన సమైక్య ఉద్యమం హోరెత్తించేందుకు నేటి నుంచి 12 వరకు గ్రామ స్థాయి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఇందిరాపార్కు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్షలు చేపడతారు. ఈనెల 13న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టనున్నారు. 14న మహిళా ఉద్యోగుల ర్యాలీలు జరుపనున్నారు. 15న ఏపీఎన్జీవోలు భేటీ కానున్నారు. 16న సమైక్య పరిరక్షణ వేదిక సమావేశం జరుపనున్నారు.