: తండాల్లో ప్రబలుతున్న అంటువ్యాధులు
మహబూబ్ నగర్ జిల్లా గిరిజన ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. జ్వరాలు, అతిసారం వ్యాపిస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన మందులు అందుబాటులో లేకపోవడంతో తండాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అతిసారం కారణంగా ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఇదే తండాలో మరో 35 మంది తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు.