: నగదు బదిలీ పథకంపై సంపూర్ణ విశ్వాసం ఉంది: చిదంబరం
నగదు బదిలీ పథకం భారత్ లో ఓ విప్లవాత్మక మార్పు తెస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అభిప్రాయ పడ్డారు. ఈ పథకం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం తగ్గుతుందని.. వృద్ధుల ఫించను, ఉపాధి హామీ భత్యాలు, వైద్య బీమా వంటి పథకాల్లో సొమ్ము నేరుగా లబ్ధిదారుని ఖాతాలో జమ అవుతుందని ఆయన తెలిపారు.
ప్రజలకు ఎంతో మేలు చేకూర్చే ఈ విధానాన్ని కొంతమంది వ్యతిరేకించడం ఆశ్చర్యం కలిగిస్తోందని చిదంబరం అన్నారు. ఇప్పటివరకు 51 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకాన్ని ఈ ఏడాది చివరికి 700కు పైగా జిల్లాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు లబ్థి చేకూర్చే అనేక రుణ పథకాలు బ్యాంకుల ద్వారా అందుబాటులో ఉన్నాయని చిదంబరం అన్నారు.