: లష్కరే తోయిబా ప్రధాన సమన్వయకర్త అరెస్ట్
లష్కరే తోయిబా ప్రధాన సమన్వయకర్త మంజూర్ ను రక్షణ దళాలు అరెస్టు చేశాయి. కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే పలు కేసులలో ముఖ్య నిందితులను ఉన్నతాధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారి విచారణలో వెల్లడైన సమాచారంతో ఇతర ముఖ్య నిందితులను కూడా అరెస్టు చేస్తున్నారు.