: పారిస్ లో నగల దుకాణం లూటీ


ఫ్యాషన్ ప్రపంచానికి వేదికగా నిలిచే పారిస్ లో ఈ తెల్లవారుజామున ఒక నగల దుకాణాన్ని నలుగురు దుండగులు దోచేశారు. తమ కారుతో దుకాణం లోపలికి చొచ్చుకునిపోయేందుకు దుండగులు ప్రయత్నించగా దుకాణం కిటికీ ధ్వంసమైంది. 2.6 మిలియన్ యూరోల విలువ చేసే నగలతో ఉడాయించారు. తాము వచ్చిన కారును అక్కడే తగుల బెట్టి మరో కారులో పరారైనట్టు పోలీసులు గుర్తించారు. కొద్ది రోజుల క్రితం కాన్స్ చిత్రోత్సవం సందర్భంగా పలువురు సెలబ్రిటీలు కోట్ల డాలర్ల విలువ చేసే తమ ఆభరణాలు పోయాయని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వాటి దొంగతనం తరువాత అత్యంత ఖరీదైన లూటీ ఇదే. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News