: కేసీఆర్ పై జీవితకాలానికి సరిపడా కేసులు పెట్టాలి: పయ్యావుల


ఏపీఎన్జీవోల సభలో జరగని విషయాలపై టీఆర్ఎస్ నేతలు అవాకుటు చవాకులు పేలుతున్నారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ ప్రజల్లో అవాస్తవాలు ప్రచారం చేసి పబ్బం గడుపుకుందామని టీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని మండిపడ్డారు. నిజాం కాలేజీ దగ్గర జరిగిన విషయాన్ని రాద్ధాంతం చేస్తున్న నేతలు, ఏపీఎన్జీవోలపై కేసులు పెట్టమని గొంతులు చించుకుంటున్న టీఆర్ఎస్ నేతలు ఓ సారి తమ చరిత్రను తిరగచూసుకోవాలని హితవు పలికారు.

శాంతియుతంగా సభ నిర్వహించిన ఏపీఎన్జీవోలపై కేసులు పెడితే, బైక్ ల మీద వెంబడించి బస్సులపై దాడులకు దిగిన వారిపై ఏ కేసులు పెట్టాలని ఆయన ప్రశ్నించారు. వారిని ప్రోత్సహించిన వారిపై ఏ కేసులు పెట్టాలని అడిగారు. అలా అయితే హరీష్ రావు, ఈటెల రాజేందర్, కోదండరాంలపై వెయ్యేసి కేసులు పెట్టాలని అన్నారు. కేసీఆర్ కు జీవితకాలానికి సరిపడా కేసులు పెట్టొచ్చన్న వాస్తవాన్ని గుర్తించి మాట్లాడాలని సూచించారు. మీరు అబద్దాలు చెప్పడంపై బ్రతికాలనుకుంటున్నారని పయ్యావుల దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News