: దావూద్ ను అరెస్టు చేసేందుకు కలసివస్తాం: అమెరికా
డీ గ్యాంగ్ వ్యవస్థాపకుడు దావూద్ ఇబ్రహీం ను పట్టుకునేందుకు అమెరికాతో కలిసి పని చేయనున్నట్టు కేంద్ర హోం మంత్రి షిండే ప్రకటించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ దావూద్ ను అరెస్టు చేసేందుకు భారత్ ప్రతిపాదనలకు అమెరికా అంగీకారం తెలిపిందని అన్నారు. దావూద్ చాలా ఏళ్లుగా పాకిస్థాన్ లోనే ఆశ్రయం పొందుతున్నట్టు భారత నిఘావర్గాల సమాచారం. దీంతో లాడెన్ తరహాలో దావూద్ ను మట్టుబెట్టేందుకు మరోసారి అమెరికా పాక్ పై సీక్రెట్ దాడికి పథకం వేసిందని విశ్లేషకులు చెబుతున్నారు.