: పాక్ యువతులు పెళ్లిలో బాలీవుడ్ చీరలు కోరుకుంటున్నారట!
పాకిస్థాన్ యువతులు బాలీవుడ్ సినిమాల్లో పెళ్లిళ్ల సందర్భంగా ధరిస్తున్న చీరలు కావాలంటున్నారని పాకిస్థాన్ ఫ్యాషన్ డిజైనర్ బి. మరియ తెలిపారు. ఢిల్లీలో ఓ ఫ్యాషన్ షో లో తాను డిజైన్ చేసిన వస్త్రాల ప్రదర్శన సందర్భంగా ఆమె మాట్లాడుతూ బోర్డర్ పొడుగునా యువతులు ఈ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రధానంగా ప్రియాంకా చోప్రా, కరీనా కపూర్ లు ధరించే చీరలకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు. తనను చాలామంది నవ వధువులు సంప్రదించి బాలీవుడ్ నటీమణులు ధరించేలాంటి చీరలు కావాలని కోరుతారని ఆమె తెలిపారు. మరొ కొంత మంది తమకు ఏ సినిమాలో డ్రెస్ నచ్చిందో తెలిపేందుకు సీడీలు కూడా ఇస్తారని ఆమె అన్నారు. పాక్ లో భారతీయ సినిమాలపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే.