: రవీంద్రనాథ్ రెడ్డికి చుక్కెదురు
కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డికి ఫోర్జరీ కేసులో చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కడప మొదటి అడిషనల్ మేజిస్ట్రేట్ కొట్టివేశారు. దీంతో రవీంద్రనాథ్ రెడ్డిని పోలీసులు కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ రోజు ఉదయమే ఆయన కోర్టులో లొంగిపోయారు. ఇక రవీంద్రనాథ్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు వేసిన పిటిషన్ పై తీర్పు పెండింగ్ లో ఉంది.