: నా కొడుకుని వదిలేయండి: మీడియాకు సచిన్ విన్నపం
తన కొడుకు అర్జున్ టెండుల్కర్ ను తోటి వారిలా సాధారణంగా జీవించనీయండంటూ ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ మీడియాకు విజ్ఞప్తి చేశాడు. ఇటీవలి కాలంలో మీడియా సచిన్ 14 ఏళ్ల కొడుకు అర్జున్ టెండుల్కర్ పై పెద్ద ఎత్తున కథనాలు ప్రసారం చేస్తున్నాయి. అర్జున్ మరో సచిన్ అంటూ రాస్తుండడంతో అతడిపై ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో సచిన్ మీడియాకు విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తండ్రి అడుగు జాడల్లో నడవాలంటూ అర్జున్ కు ఎవరూ చెప్పలేదని సచిన్ అన్నారు. తన కొడుకుపై ఎవరూ ఒత్తిడి తీసుకురావద్దని కోరారు. అర్జున్ క్లబ్ స్థాయిలో తొలిసారిగా ఆదివారం ఆడాడు. ఇందులో అర్జున్ ఆటతీరు ఆకట్టుకోలేదు. కేవలం 12 బాల్స్ కే అవుటయ్యాడు.