: కాళోజీ శతజయంతి వేడుకలు
'ఒక్క పుస్తకాన్నివ్వు, వేయి మెదళ్లను వెలిగిస్తాను' అన్న ప్రజాకవి కాళోజి శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వరంగల్ లోని హన్మకొండలో కాళోజీ విగ్రహానికి కవులు, రచయితలు, టీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. ప్రజా సమస్యలను ఎత్తి చూపి పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టిన మహాకవి కాళోజీ అంటూ వక్తలు ఆయన సేవలను కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. కాళోజీ తుది శ్వాస వరకూ తెలంగాణ పోరాటానికి తన శక్తిని ధారపోశాడని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కాళోజీ ఫౌండేషన్ నిర్వహించింది.